సాంగ్స్ బాగుంటేనే మీ పేరు వేస్తాం అన్నారట.. !

ఎన్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ ద్విపాత్రభినయం చేసిన చిత్రం జయం మనదేరా. భానప్రియ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే ఈ సినిమా సంగీతం విషయంలో ఓ చిన్న సంఘటన జరిగింది. ఎన్ శంకర్ మొదటి సినిమా నుండి వందేమాతరం శ్రీనివాస్ తోనే సంగీతం చేయించుకోవడం ఇష్టం. ఇదే విషయాన్ని వెంకటేష్ తో చెబితే ఆయన ఎక్కువగా విప్లవ సినిమాలకు మ్యూజిక్ చేస్తారు కదా అన్నారట. ఈ సినిమాకు చేయగలరా అనే సందేహం వ్యక్తం చేశారట. కానీ ఓ కండిషన్ పెట్టారట. సినిమాలో పాటలు బాగుంటే మీ పేరు వేస్తామని చెప్పారట. దీనిని ఓ ఛాలెంజ్ గా తీసుకున్న ఆయన చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు ముందుగారుద్రమ నాయుడు అనే టైటిల్ అనుకున్నారు కానీ సినిమా టైటిల్ చివర్లో రా ఉండడం వెంకటేష్ కు బాగా కలిసిరావడంతో ఈ సినిమాకి కూడా రా అక్షరం వచ్చేలా టైటిల్ పెట్టాలని అనుకొని జయం మనదేరా అనే పెట్టారు .మొత్తం మూడు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డుల దక్కాయి. ఉత్తమ విలన్ గా జయప్రకాష్ రెడ్డి, ఉత్తమ సహాయ నటిగా ఝాన్సీ నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడుగా వెంకటేష్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here