ఇండస్ట్రీలో చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. అందులో బాలకృష్ణ, విజయశాంతి ఒకటి.. వెండితెరపై వీరిద్దరి జోడీకి ఉన్న క్రేజ్ మామూలు కాదు .. ఈ కాంబినేషన్ తో సినిమా కథలు రాసేవారు మేకర్స్. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు.
1984లో కథానాయకుడు చిత్రంతో’ మొదలైన ఈ కాంబినేషన్ దాదాపు 11 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఈ సమయంలో వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా 17 సినిమాల్లో నటించారు. అందులో 90 శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. నిప్పురవ్వ చిత్రం తరువాత వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు. నిప్పురవ్వ చిత్రం తర్వాత విజయశాంతి, బాలకృష్ణ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఇద్దరు కలిసి నటించలేదని అప్పట్లో న్యూస్ కూడా వైరల్ అయింది.
అయితే ఈ వార్తలపై ఆ మధ్య విజయశాంతి స్పందించారు. నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని, ఇమేజ్ కూడా పెరగడం, హీరోయిన్ బేస్ సినిమాల పైన ఫోకస్ చేశానని అందుకే మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా రాలేదని చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. నాయుడమ్మ సినిమా తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన విజయశాంతి.. 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.