కమల్ హాసన్, విజయశాంతి వదులుకున్న బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ

వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ఆదిత్య 369. టైమ్‌ మెషీన్‌ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం 1991లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని నటించింది. తరుణ్, అమ్రీష్ పురి, గొల్లపూడి మారుతీరావు, సుత్తివేలు, శ్రీలక్ష్మి కీలక పాత్రాలు పోషించారు. మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఇక కెమెరామెన్‌గా పీసీ శ్రీరామ్‌ను అనుకున్నా, ఇతర కారణాల వల్ల ఆయన తప్పుకొన్నారు. దీంతో వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక బాలకృష్ణ చేసిన శ్రీకృష్ణ దేవరాయిలు పాత్రకు ముందుగా కమల్ హాసన్ ను అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో బాలకృష్ణనే రెండు పాత్రాలు చేస్తానని చెప్పారు. ఇక ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నారు. కానీ, ఆమె డేట్లు సర్దుబాటు చేయలేపోవడంతో పీసీ శ్రీరాంకు పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు.

మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు సిక్వెల్ తీయాలని బాలకృష్ణ అనుకుంటున్నారు కానీ ముందుకు వెళ్లడం లేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here