అర్జున్, జగపతి బాబు, వేణు తొట్టెంపూడి,స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హనుమాన్ జంక్షన్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2001 లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సీన్లు చూస్తే నవ్వు రావడం పక్కా. అయితే ఈ సినిమాలో హీరోలుగా ముందు జగపతి బాబు, అర్జున్‌లను అనుకోలేదట మేకర్స్ .. రాజశేఖర్, మోహన్ బాబు లతో ఈ సినిమా చేయాలని అనుకున్నారట.
సినిమా స్టోరీ రాజశేఖర్‌కు చెప్తే ఓకే కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుని అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడట. కారణం మోహన్ బాబేనట. హనుమాన్ జంక్షన్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నాడన్న విషయం ముందుగా రాజశేఖర్‌కు తెలియదంట. తేలిశాక సినిమా నుంచి తప్పుకున్నాడట. అప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడంట.
మోహన్ బాబు షూటింగ్ 9 గంటలకు ఉందంటే.. నేను పది గంటల వరకు వెళ్తాను.. కానీ మోహన్ బాబు అలా కాదు. కచ్చితంగా టైమ్ పాటిస్తాడు. కానీ నాకు ఆ క్రమశిక్షణ లేదని చెప్పాడట. సినిమా పూర్తయ్యేసరికి గొడవలు వస్తాయన దీంతో తమ రిలేషన్ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్టుగా రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా జగపతి బాబు, అర్జున్ దగ్గరికి వెళ్లింది. సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పటి స్టార్ డెరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.