డాన్స్ మాస్టర్ లేకుండానే సినిమాను చేసిన దర్శకేంద్రుడు

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి. అశ్వనీ దత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. 1996 జనవరి 12న ఈ సినిమా రిలీజై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.

అప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు ఈసారి చిన్న బడ్జెట్లో లో సినిమా చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి సందడి మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారు. సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకు కొరియోగ్రఫర్ లేకుండానే అన్ని పాటలకు రాఘవేంద్రరావే కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగానే కాకుండా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు అందుకున్నారు దర్శకేంద్రుడు. అయితే ఈ అవార్డును వెనక్కి ఇచ్చేశారాయన.

సౌందర్య లహరి పాటను నలభై రోజుల పాటు చిత్రీకరించారు. షూటింగ్ జరిగే ప్రతి చోట ఈ పాట కొంత భాగాన్ని షూట్ చేశారట. అయితే స్వప్న సుందరి ఎలా ఉంటుంది అంటే నాలుగు డైలాగులు చెబితే సరిపోతుంది అని ముందుగా అనుకున్నారట. కానీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో దానికి ఓ పాటనే రాయించారు దర్శకేంద్రుడు. అదే రమ్యకృష్ణ లాగా ఉంటుందా అనే పాట. 85 లక్షలతో రూపొందిన ఈ చిత్రం 15 కోట్లు వసూలు చేసింది.

అత్యధికంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో రూ.1.28 కోట్లు వసూలు చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో 301 రోజులు ఆడింది ఈ చిత్రం. ఈ సినిమా సక్సెస్ కావడంతో శ్రీకాంత్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇదే సినిమా టైటిల్ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో రాఘవేంద్ర రావు సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అంతలా సక్సెస్ అందుకోలేకపోయింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here