రవితేజతో పోకిరి ఎందుకు ఆగిపోయింది.

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పోకిరి.. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా మహేష్ స్టార్ డం ను అమాంతం పెంచేసింది. అయితే ముందుగా ఈ సినిమాను మహేష్ బాబుతో కాకుండా హీరో రవితేజతో చేయాలని పూరి జగన్నాథ్ అనుకున్నారట.

రవితేజ, పూరి కాంబినేషన్ సూపర్ హిట్.. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుండి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వరకు అన్ని సూపర్ హిట్స్ దొరికాయి.. ఓ మూడు నెలల్లో సినిమా అయిపోతుంది అంటే డేట్స్ ఇచ్చేందుకు రవితేజ ఎప్పుడు రెడీనే.. అప్పుడు పోకిరి సినిమాను చేద్దామని ఇద్దరు అనుకున్నారట.

అయితే అప్పటికే తమిళ్ లో సూపర్ హిట్ అయిన నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీని తెలుగులో చేసేందుకు రవితేజ ఎంతో వెయిట్ చేస్తుండడంతో, ఆ సినిమా ఆఫర్ కూడా అప్పుడే రావడంతో రవితేజ పోకిరి సినిమాను పక్కన పెట్టారట. దీంతో ఇదే కథతో మహేష్ బాబుతో సినిమా చేయాలని పూరి అనుకున్నారట

మహేష్ బాబు చెప్పిన కొన్ని మార్పులతో పోకిరి చిత్రాన్ని తెరకెక్కించారు పూరి జగన్నాథ్. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. పోకిరి సినిమా లోని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. అయితే పోకిరి లాంటి హిట్ మళ్ళీ పూరికి పడలేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here