పరుగు.. మెరుగైన ఆరోగ్యానికి చక్కని వ్యాయామంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ట్రాక్, ఫీల్డ్ లేదా ట్రెడ్‌మిల్‌పై కూడా చేయవచ్చని సలహా ఇస్తున్నారు. దీని వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుందని, శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ చెబుతున్నారు. ఈ పరుగును జీవితంలో ఓ భాగం చేసుకోవాలని, వారానికి ఒకసారైనా చేయాలని సూచిస్తున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీకి ప్రయోజనకరంగా ఉంటుందని తెలుపుతున్నారు.
పరుగు ప్రయోజనాలు:
1. పరిగెత్తడం వల్ల కాళ్లలోని కండరాలకు శక్తి వస్తుంది, అంతే కాకుండా శరీరంలోని కేలరీలు బర్న్ అయ్యి, కొవ్వు తగ్గిపోతుంది.
2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చడంలో పరుగు కీలక పాత్ర పోషిస్తుంది, మధుమేహం, PCOD వంటి సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
3. వ్యాయామం సమయంలో హృదయ స్పందన రేటు , ఆక్సిజన్ వినియోగం పెరగడం ద్వారా గుండె మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
4. పరిగెత్తడం వల్ల ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపర్చడంతో పాటు, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.
5. పరుగును జీవనశైలిలో చేర్చుకుంటే మెదడుకు శక్తి, చురుకుదనం కూడా లభిస్తుంది.