బ్రిటన్ సంతతికి చెందిన భారతీయ రచయిత రస్కిన్ బాండ్ రాసిన రచనలు జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తాయి. వాటిలో కొన్నిఇప్పుడు తెలుసుకుందాం.
ఆశ
ఎన్ని యుద్దాలు వచ్చినా, ఆగిపోయినా.. సీతాకోకచిలుక మాత్రం అందంగానే ఉంటుంది
దయ
నవ్వడం, దయతో ఉండడం మాత్రమే మనిషిని మృగంలా మారకుండా చేస్తుంది.
పుస్తక పఠనం
ఒక గొప్ప పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమైనట్టు. అలాగే ఒక గొప్ప పుస్తకం మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపర్చని స్నేహితుని లాంటి వాడు
జీవించండి
ఆనందం అనేది సీతాకోకచిలుక వంటిది. ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కానే చూసే విధానమే మారుతుంది. అలాగే చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించండి. అవి మళ్లీ మళ్లీ మీ జీవితంలోకి రావు.
ఆనందం
ఆనందమనేది ఒక రహస్యమైన విషయం. అది మనం ఎక్కడ వెతికితే అక్కడ కనబడుతుంది.
ధైర్యం
ధైర్యం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉండదు. అదే మనల్ని గమ్యానికి చేరుస్తుంది.
ప్రేమ
యువ ప్రేమికులకు ఎర్ర గులాబీలు.. ధీర్ఘకాలిక సంబంధాల కోసం ఫ్రెంచ్ బీన్స్