Homecinemaపల్లెల నుంచి పట్నంలో స్వీట్​ కార్న్ క్రేజీ

పల్లెల నుంచి పట్నంలో స్వీట్​ కార్న్ క్రేజీ

కణకణ మండే బొగ్గులపై .. వేగిన మొక్కజొన్న పొత్తులను నోరారా తింటుంటే.. ఆ మజానే వేరు! అయితే మొక్కజొన్న పొత్తుకున్న కీర్తిలో వాటా దక్కే హక్కు నాకూ ఉందంటుంది స్వీట్‌ కార్న్‌. తియ్యని రుచుల మంత్రమేసి పట్టణాల్లోనే కాదు పల్లె ప్రజల మనసు కూడా దోచుకుంది. అందుకే ఎక్కడ చూసినా స్వీట్ కార్న్ స్టాళ్లు కనిపిస్తుంటాయి. నాలుగేళ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో ఉన్న స్వీట్ కార్న్ స్టాళ్లు ఈ రెండేళ్ల కాలంలో పదింతలు పెరిగాయంటే అతిశయోక్తి కాదు.

మొక్కజొన్న పోత్తులతో పోల్చితే.. స్వీట్ కార్న్ గింజలు మెత్తగా ఉంటాయి. తియ్యగా ఉంటాయి. రుచి కాస్త భిన్నంగా ఉండటంతో పాటు, కారం, నిమ్మకాయ కాస్త వాటికి దట్టిస్తే .. వారెవ్వా అనాల్సిందే. ఒక్కసారి ఈ రుచికి అలవాటు పడితే మళ్లీ మళ్లీ వాటిని తినాలనిపిస్తుంటుంది. మామూలు మొక్కజొన్న పొత్తులకు, వీటికి ధరలో చాలా తేడా ఉంటుంది.

మొక్కజొన్నల సీజన్‌ ప్రారంభంలో ఒక్కోటి పది రూపాయలు ఉన్నా… ఆ తరువాత అదే ధరకి మూడు కంకులు వస్తాయి. అదే స్వీట్ కార్న్ విషయానికి వచ్చేసరికి ఒక్కోటి 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది. వీటిలో పీచు పదార్థం పుష్కలం. ఏ, బీ, సీ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ తగు మోతాదులో లభిస్తాయి. నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. చక్కెర, పిండి పదార్థాలు అధికంగా ఉన్నందు వల్ల, డయాబెటిస్‌ ఉన్న వాళ్లు వీటిని తక్కువగా తినాలి.

జగిత్యాల జిల్లా కేంద్రానికి రోజుకు 15 నుంచి 20 క్వింటాళ్ల స్వీట్‌కార్న్‌ హైదరాబాద్‌లోని ఒంటి మామిడి మార్కెట్ నుంచి దిగుమతి అవుతుంది. ఎంతో ఆదరణ ఉన్న స్వీట్ కార్న్ పంటను ఈ జిల్లా రైతులు అతి తక్కువగా సాగు చేస్తున్నారు. ఇలాగెందుకని పలువురిని అడిగితే ఈ పంట గురించి అవగాహన తక్కువగా ఉండడం వల్లే అనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేశారు. ‘‘ఒంటి మామిడి నుంచి స్వీట్‌కార్న్‌ దిగుమతి చేసుకుంటా. ఆరు సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నా. ఏడాదిలో ఆరు నెలల పాటు ఈ సీజన్ ఉంటుంది. గొల్లపల్లి, మోతె, శ్రీ రాం పల్లి, రాయికల్, మాల్యాల, కొండగట్టు, పెర్కిట్, కొరుట్ల, మెట్ పల్లి తదితర గ్రామాల వాళ్ళు నా దగ్గరే కొనుగోలు చేస్తారు. రైతులకు ఈ పంటపై అవగాహన కల్పించి ఇక్కడే పండిస్తే అధిక లాభాలు పొందొచ్చు’’ అంటున్నారు


జగిత్యాలలో స్వీట్ కార్న్ పంట తక్కువ మొత్తం పండిస్తున్నారు. ఇందుకు కారణం… రిస్క్ ఫాక్టర్ ఎక్కువ అనేది డీఏవో రాజేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పంట పండించడమే కాదు మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడి డిమాండ్ బట్టి ఐదారు గుంటల పంట వేస్తే సరిపోతుంది. ఒక ఎకరానికి 40 క్వింటాల మక్కలు వస్తాయి, కంకులతో కలిపితే 100 క్వింటాల బరువు తూగుతుంది. ఈ పంటకు మరింత డిమాండ్ పెరిగితే అప్పుడు అవకాశాలు కూడా పెరుగుతాయి. పంట వేసిన రైతుకు లాభం వస్తుంద’’న్నారాయన.

మరి స్వీట్‌కార్న్‌ వ్యాపారం చేస్తున్న వాళ్లేమంటున్నారో తెలుసుకోవడం కూడా అవసరం కదా. అందుకని వాళ్లను కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చారు… ‘‘మూడు సంవత్సరాల నుంచి స్వీట్ కార్న్ అమ్ముతున్నాం. మొదటి ఏడాది అంతగా గిరాకీ లేదు. ఇప్పుడిప్పుడు అందరూ కొంటున్నారు. వ్యాపారం లాభసాటిగానే ఉంది. మాకు 20 నుంచి 30 రూపాయలకు కిలో పడుతుంది. ఒక్కో కార్న్‌ పదిహేను రూపాయలకు అమ్ముతున్నాం’’ అని చెప్పారు మాదాపూర్‌


రెండు ఏళ్లుగా స్వీట్ కార్న్ అమ్ముతున్న అహ్మద్‌ మాట్లాడుతూ ‘‘ఏడాదిలో ఆరు నెలల పాటు ఇదే వ్యాపారం చేస్తా. చలి కాలంలో ఎక్కువగా కొంటారు. కాలేజి , స్కూల్ విద్యార్థులు తరుచుగా వస్తుంటారు’’ అని చెప్పాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc