ప్రధాని మోదీ తల్లి కన్నుమూత.. తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ఏపీకి మరో 26 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్.. ఆ దేశాల నుంచి వస్తే ఆర్టీపీసీఆర్ మస్ట్‌

ప్రధాని మోదీకి మాతృవియోగం..

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని UN మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

783 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్


లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 783 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. పూర్తి నోటిఫికేషన్​ వివరాలకు

డీజీపీగా అంజనీకుమార్


తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అంజనీ కుమార్‌‌ను ఇంచార్జ్‌ డీజీపీగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్‌, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్‌, లా అండ్ ఆర్డర్‌ డీజీగా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

90 సీట్లే టార్గెట్: బండి సంజయ్


బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయడానికి సొంత పార్టీ నేతలే సిద్ధంగా లేరని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పార్టీలో తెలంగాణ లేదని… ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డబ్బులు పంపుతున్నాడని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్‭కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి పేర్కొన్నారు. 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

పరీక్షల షెడ్యూల్ విడుదల


యూజీసీ- నెట్ డిసెంబర్ 2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

సీబీఎస్ఈ పరీక్షల తేదీలు విడుదల..


దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షఎడ్యూల్ ను బోర్డు తాజాగా విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు మార్చి 21 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై.. ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని బోర్డు వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య గ్యాప్ ఇస్తూ.. జేఈఈ మెయిన్ తదితర కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డేట్ షీట్లను విడుదల చేసినట్లు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.

8 నెలల్లో ఎన్నికలు.. ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు మోదీ..


రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని.. మిషన్ 90 పై ఫోకస్ చేయండంటూ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తారని ఆయన వెల్లడించారు. ఈలోగా పార్టీ నేతలు బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని చెప్పారు. ఫామ్ హౌస్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా సంతోష్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానన్నారు.

ఆ దేశాల నుంచి వస్తే ఆర్టీపీసీఆర్ మస్ట్‌


కరోనా కొత్త వేరియెంట్‌ భారత్ లో కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తు‍న్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ వంటి ఆరు దేశాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్‌లోడ్‌ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది.

ఎక్కడుంటే అక్కడ్నుంచే ఓటింగ్


ఓటు వేయాలంటే ఇకపై సొంతూరి వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఏ ఊళ్లో ఉంటే ఆ ఊరి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం రిమోటు ఓటింగ్ మిషన్‌(ఆర్వీఎం) తయారు చేసినట్టు గురువారం ఈసీ ప్రకటించింది. ఈ మిషన్‌ పనితీరును వివరించేందుకు అన్ని రాజకీయా పార్టీలకు ఆహ్వానం పంపింది. జనవరి 16న ఈ కార్యక్రమం జరగనుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

సంక్రాంతికి ఏపీకి మరో 26 స్పెషల్ ట్రైన్లు.. రేపటి నుంచే రిజర్వేషన్లు..


సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 26 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ డిసెంబర్ 31 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొంది.

కేటీఆర్ మామ హరినాథరావు మృతి


సీఎం కేసీఆర్​ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్​ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హరినాథరావు గురువారం మధ్యాహ్నం 1:10 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హరినాథరావు మృతి విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ,ఇతర​ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. హరినాథరావు పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్సీ కవిత, మంత్రులు నివాళి అర్పించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc