రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతం:గవర్నర్.. గ్రూప్-4 కు పోటీ ఎంతంటే?.. ఈటలతో కేటీఆర్ ముచ్చట్లు.. ఎల్లుండే ఎంసెట్ షెడ్యూల్.. మరో 2 మున్సిపాలిటీల్లో అవిశ్వాసం.. నేటి టాప్ న్యూస్

రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతమన్న గవర్నర్


తెలంగాణ రాష్ట్రమంతా ప్రతీ రంగంలోనూ అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందాన్నారు. నిన్న తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే.. ఇన్నాళ్లు వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన గవర్నర్ నోట ప్రభుత్వంపై పొగడ్తలు రావడంతో అధికార పక్షం ఆనందం వ్యక్తం చేసింది. గవర్నర్ తో తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యానించగా… ప్రసంగా సాదాసీదాగా సాగిందని సీఎఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ముగిసిన గ్రూప్-4 దరఖాస్తులు


నెల రోజులకు పైగా సాగిన గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 8,180 పోస్టులకు గాను.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో సగటున ఒక్క పోస్టుకు 116 మంది పోటీలో ఉన్నారు.

రాష్ట్రంలో రైల్వేకు రూ.4,418 కోట్లు


కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాకపోగా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం నిధులు పెంచింది. గతేడాది 3,045 కోట్లు కేటాయించగా.. ఈ సారి 4,418 కోట్లను కేటాయించింది. ఇందులో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ, రామగుండం-మణుగూరు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.

మరో 2 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు


తెలంగాణలోని మరో రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాస గంట మోగింది. తాజాగా జనగామా. సంగారెడ్డి బీఆర్ఎస్ కి చెందిన మున్సిపల్ చైర్మన్లపై సొంత పార్టీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను కలెక్టరేట్లలో అందించారు. వీరికి ప్రతిపక్షాల కౌన్సెలర్లు మద్దతు తెలిపారు.

ఈటలతో కేటీఆర్ ముచ్చట


అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభల ప్రారంభానికి ముందు శాసనసభలోకి వచ్చిన మంత్రి కేటీఆర్ బీజేపీ సభ్యులు రఘునందన్, ఈటల రాజేందర్ ను కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా మొన్న నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు రాలేదని ఈటలను కేటీఆర్ అడగగా.. పిలిస్తే కదా వచ్చేందంటూ ఆయన సమాధానమిచ్చారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వచ్చి తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని వాఖ్యానించగా.. కేటీఆర్ నవ్వి మమ్మల్ని పిలవని వారు ఎవరూ ఉంరంటూ వాఖ్యానించారు.

ముగిసిన కే.విశ్వనాథ్ అంత్యక్రియలు


ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వీ కే.విశ్వనాథ్ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో అశ్రునయనాల నడుమ ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు అభిమానులు, సినీ రంగ ప్రముఖులు తరలివచ్చారు. విశ్వనాథ్ ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అరుదైన దర్శకుడని కొనియాడారు.

6న ఎంసెట్ షెడ్యూల్


ఈ నెల 6న తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దీంతో పాటు ఈ-సెట్, ఐ-సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్ షెడ్యూళ్లను సైతం విడుదల చేయనున్నట్లు చెప్పారు. మే మొదటి వారంలో ఎంసెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది.

కొత్త సచివాలయంలో మంటలు..


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు ఎగసిపడ్డాయి. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు క్రమంగా పైకి వ్యాపించాయి. ఆరో అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. అనంతరం పై డోమ్‌ల నుంచి దట్టమైన పొగ వెలువడింది. 11 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. 

షర్మిల ఫ్లెక్సీలు ధ్వంసం:


వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వర్ధన్నపేట నియోజక వర్గంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు చెందిన ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ ఫ్లైక్సీలను బీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here