గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు.. తెలంగాణకు మోదీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు.. హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం.. రాష్ట్రానికి మరో 21 వేల కోట్ల పెట్టుబడులు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

3 నుంచి బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే..


తెలంగాణ రాష్ట్ర శాసనసభ, బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రభుత్వం రెండు సభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే.. మరో సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు సాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రానున్నందున.. వారు రాష్ట్రానికి కేటాయించిన నిధుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

13న తెలంగాణకు మోదీ రాక..

ఫిబ్రవరి 13న పీఎం మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టుకు భూమి పూజ, మూడు జాతీయ రహదారులకు భూమి పూజ, ఐఐటీ హైదరాబాద్ భవనాల ప్రారంభోత్సవం, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో రైలు మార్గం పనుల ప్రారంభం కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నాట్లు సమాచారం.

26న హాత్‌ జోడో యాత్ర ప్రారంభం

ఈ నెల 26న హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ప్రారంభిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందన్నారు. హాత్‌ సే హాత్‌ జోడోలో భాగంగా పాదయాత్ర చేస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలం నుంచి తాను పాదయాత్రను ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని, ఠాక్రే భేటీకి మూడుసార్లు రాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ముత్తిరెడ్డి సంచలన వాఖ్యలు

బారత్ రాష్ట్ర సమితికి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వొద్దని.. వారు వస్తే తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధిని చూసి ఆ నేతలకు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు.

తెలంగాణకు మరో రూ.21 కోట్ల పెట్టుబడులు

స్విర్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.21 వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తనతో పాటు అధికారుల బృందం నాలుగు రోజుల పాటు అక్కడి సమావేశాల్లో పొల్గొని తెలంగాణలోని పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు

తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజుల్లో 3.87 లక్షల మంది కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇందులో 97,335 మంది అద్దాలు అందించామన్నారు. శనివారం కంటివెలుగు కార్యక్రమ అమలుపై కలెక్టర్లలో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం


సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన మరవక ముందే రాజధానిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో శనివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఐదు కార్లు దగ్ధం అయ్యాయి. పార్కింగ్ లో ఉంచిన ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సంక్రాంతికి ఆర్టీసీ భారీ లాభాలు

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాలను ఆర్జించింది. ఈ నెల 10 నుంచి 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ఆర్టీలో ప్రయణించారు. దీంతో ఈ 11 రోజుల్లో సంస్థకు 165.46 కోట్ల ఆదాయం లభించింది. గత సంక్రాంతి సీజన్ తో పోల్చితే ఈ సారి 12 లక్షల మంది అదనంగా ప్రయాణించగా.. రూ.62.29 కోట్ల ఆదాయం అదనంగా లభించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here