లోక్ సభను రద్దు చేయాలని కేటీఆర్ సవాల్.. పెరగనున్న పీఎం కిసాన్ పైసలు.. రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు.. నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త.. తారకరత్న హెల్త్ కండిషన్ పై తాజా అప్టేట్.. నేటి టాప్ టెన్ న్యూస్

లోక్ సభను రద్దు చేయాలని కేటీఆర్ సవాల్:


దమ్ముంటే లోక్ సభను రద్దు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ సవాల్ విసిరారు. తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. తెలంగాణపై మోదీ సర్కార్ కక్ష కట్టిందని ధ్వజమెత్తారు. నిన్న నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ కీలక వాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నారు.

పీఎం కిసాన్ పై గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద మరో రూ.2 వేల సాయాన్ని అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.8 వేలు చేయాలన్నది మోదీ సర్కార్ ఆలోచనగా సమాచారం.

ప్రపంచానికి కరోనా ఖర్చు ఎంతంటే?


ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ కు గురైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచం రూ.30 లక్షల కోట్లను ఖర్చు చేసింది. ఈ మేరకు లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదక వివరాలను వెల్లడించింది. కరోనా కారణంగా ప్రజలకు 810 శాతం వైద్య ఖర్చు పెరిగినట్లు తేల్చింది. భారత్ లో సగటు తలసరి ఖర్చు రూ.5678కి చేరినట్లు తెలిపింది.

భారీగా డీఎస్పీల బదిలీలు

ఇటీవల భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం… తాజాగా రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీలు చేపట్టారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం:

గుండె పోటుకు గురై చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్నఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన గత కొంతకాలంగా మెలెనా వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. మెలెనా రోగులకు విపరీతమైన రక్తస్రావం ఉంటుందని.. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం అవుతుందన్నారు. తీవ్రమైన గుండెపోటు తర్వాత రక్త నాళాలలో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. రక్తస్రావం కారణంగా గుండెకు వైద్యపరమైన సవాల్ ఎదురైందని.. కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేసినట్లు చెప్పారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న డాక్టర్లు.. ప్రత్యేక వైద్య బృందంతో అధునాతన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

మరో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

తెలంగాణలో మరో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. చైర్ పర్సన్ అభివృద్ధికి సహకరించడం లేదంటూ అవిశ్వాస తీర్మాన కాపీని కలెక్టర్ సహా ఆర్డీవోకు అందజేశారు. చైర్ పర్సన్ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరించిందని కౌన్సిలర్లు ఆరోపించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రూప్-4 దరఖాస్తులు ఎన్నంటే?


8039 గ్రూప్-4 ఉద్యోగాలకు జనవరి 28 సాయంత్రం వరకు 7,41,159 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇంకా దరఖాస్తులకు మరో రెండు రోజుల సమయం ఉంది. గడువు ముగిసే నాటికి దరఖాస్తుల సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గ్రూప్-4 లో మరో 141 పోస్టులను చేర్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

రేపు, ఎల్లుండి పని చేయనున్న బ్యాంకులు

తమ సమస్యల పరిష్కారానికి రేపు, ఎల్లుండి (జనవరి 30, 31) తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ప్రకటించింది. అయితే ప్రస్తుతం.. ఆ సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లుగా యూనియన్ వెల్లడించింది. బ్యాంక్ యూనియన్ల డిమాండ్లపై చర్చించేందుకు ఈనెల 31న సమావేశం అయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్ అంగీకరించింది. ఈనేపధ్యంలోనే ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి మొత్తం 4 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే.. సమ్మెను వాయిదా వేయడంతో రేపు, ఎల్లుండి బ్యాంకులు పని చేయనున్నాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here