డీజీపీ అంజన్ ఏపీకేనా, నేడే కోర్టు తీర్పు.. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ఏడాదిలో కొన్న వాహనాలన్నీ ఇక తుక్కే.. పుష్ప-2లో సంచలన తెలుగు నటుడు.. నేటి టాప్ న్యూస్ ఇవే..

డీజీపీ అంజన్ ఏపీకేనా.. నేడు కోర్టు తీర్పు


రాష్ట్రంలో పని చేస్తున్న 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం నేడు తేలనుంది. డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారుల కేడర్ అంశంపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే సిఎస్ సోమేష్ కుమార్ ను ఏపీకి వెళ్లాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష భీష్ట, ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ,
రోనాల్డ్ రొస్, ఆనంతరాము, ఆమ్రపాలి, శ్రీజన గుమ్మన, షంషేర్ సింగ్, శివశంకర్ లోతేటి, మల్లెల ప్రశాంతి అంశంపై కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం


సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్ వేర్ లో భారీ అగ్ని ప్రమారం జరిగింది. భవనంలో చిక్కుకున్న నలుగురుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయలకు తీశారు. ఇందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్లు గుర్తించారు. భవనంలోనే మరో ముగ్గురు ఉన్నట్లు వారి బంధువులు చెబుతున్నారు. భారీగా మంటలు రావడంతో చుట్టుపక్కల నివాసాల వారు, దుకాణాల వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ మంటల ప్రభావం చుట్టుపక్కల మరో 20 భవనాలపై పడింది.

తెలంగాణలో మైక్రోసాఫ్ట్ మరో రూ.16 వేల కోట్ల పెట్టుబడి


ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలంగాణలో రూ.16,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దావోస్‌ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఈ ప్రకటన చేసింది. 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే.. మొత్తంగా 6 డాటా సెంటర్లు హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి.

కేసీఆర్ సభ ప్లాప్


భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం ప్రాజెక్టులు కడితే బోర్లు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

శంకర్‌ మిశ్రాపై నిషేధం
గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానం (Flight) బిజినెస్‌ క్లాసులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్‌.. ఘటన సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. తాజాగా శంకర్‌ మిశ్రాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆ వాహనాలు తుక్కే: కేంద్రం


15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనుంది కేంద్రం. వాటి రిజర్వేషన్లను ఉపసంహరించనుంది. ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు సైతం ఈ రూల్ వర్తించుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ మంత్రిత్వ శాఖ తన తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే.. సైన్యం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వాడే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

పుష్ప-2లో సంచలన నటుడు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ఫ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొనసాగింపు పుష్ప-2ను తెరకిక్కిస్తున్నారు. అయితే ఇందులో ప్రముఖ నడుడు జగపతిబాబు నటిస్తున్నారన్న వార్తలు ఫిల్మినగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. చిత్ర వర్గాలు మాత్రం ఈ వార్తను ఇంకా ధ్రువీకరించలేదు.

నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ ఇంచార్జి


ఈ నెల 26వ తేదీ నుంచి చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ జోడో యాత్ర నిర్వహణను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బ్లాక్ ల వారీగా నెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిపై శ్రేణులకు దిశానిర్ధేశం చేయడానికి శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.

మంత్రి ఎర్రబెల్లిపై సీఎం కేసీఆర్ సీరియస్:


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, వివాదాలు సృష్టించొద్దని సీఎం ఆయనకు హెచ్చరించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబ్‌బాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానన్నారు. ఆయన వాఖ్యలో తీవ్ర చర్చనియాంశం కావడంతో సీఎం సీరియస్ అయినట్లు సమాచారం.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here