భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. స్థలాల క్రమబద్ధీకరణపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్.. తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారి ఇళ్లు కూలుస్తామన్న బండి సంజయ్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

గ్యాస్ సిలిండర్ ధర పెంపు:

పేదలపై కేంద్రం మరో సారి భారం మోపింది. గృహపయోగ సిలిండర్ పై మరో రూ.50 భారం మోపింది. ఇంకా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.350 పెంచించింది. దీంతో హైదరాబాద్ లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1103కు చేరగా.. రూ.2119కి చేరింది. సిలిండర్ ధర పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆందోళలనకు పిలుపునిచ్చాయి.

రేపు ఆందోళనలకు కేటీఆర్ పిలుపు

భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో రేపు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపు పైన నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

తిమ్మాపూర్ లో కేసీఆర్ పర్యటన


తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తన మనసులో పురుడు పోసుకోవటానికి.. నిజాంసాగర్‌కు పట్టిన దుస్థితి ఓ కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు, ఆలయ ధర్మకర్త, సభాపతి పోచారంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదన్న కేసీఆర్‌.. నిజాంసాగర్ ఎప్పటికీ ఎండిపోయే ప్రశ్నే రాదన్నారు. ఈ సందర్భంగా బాన్స్​వాడ నియోజక వర్గానికి సీడీఎఫ్​ నుంచి రూ.57 కోట్లు మంజూరు చేశారు. ఆలయం​ వద్ద మిలిగిపోయిన పనులు చేపట్టడానికి రూ. 7 కోట్లు మంజూరు చేశారు. 67 ఎకరాల స్థలాన్ని టెంపుల్​కు కేటాయిస్తూ జీవో జారీ చేశారని స్పీకర్​ తెలిపారు.

జీవో 59పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం


జీవో 59పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఇచ్చిన జీవో 59 ప్రకారం 2014 నాటి మార్కెట్ విలువల ఆధారంగా ఫీజులు లెక్కించడానికి బదులుగా, దరఖాస్తు చేసుకున్న తేదీ నాటి మార్కెట్ విలువల ఆధారంగా ఫీజు నిర్ణయిస్తు, జీవో 59కి సవరణ చేస్తూ జీవో నం.22ని ప్రభుత్వం జారీ చేసింది.

హూజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్?

ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి హుజూరాబాద్ లో బల్మూరు వెంకట్ ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. దీంతో బల్మూరు వెంకట్ మరో సారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న సంకేతాన్ని రేవంత్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బీఆరెస్ కు, బీజేపీకి అవకాశం ఇచ్చిన ప్రజలు.. కాంగ్రెస్ కు సైతం ఓ ఛాన్స్ ఇవ్వాలన్నారు. నిన్న హుజూరాబాద్ లో యాత్ర నిర్వహించిన రేవంత్ ఈ వాఖ్యలు చేశారు. అమిత్ షా ను కలిసిన ఈటల రాజేందర్ తెలంగాణ సమస్యలను ఆయనతో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

మహిళలపై దాడులు చేసే వారి ఇళ్లు కూలుస్తాం

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే లుచ్చాల అంతు చూస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. యూపీ తరహాలో వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని సంచలన వాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిచేవారి తాట తీయాలంటూ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. 

సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు


మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను పోలీసులు పేర్కొన్నారు. అనస్థీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతి ను సైఫ్ సూపర్వైజ్ చేస్తున్నాని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. రెండు ఘటన ల ఆధారంగా ప్రీతి పై సైఫ్ కోపం పెంచుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేస్ విషయం ప్రతీ ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాయగా ఆ రిపోర్ట్ ను వాట్సాప్ గ్రూప్ లో పెట్టి సైఫ్ హేళన చేశాడని పేర్కొన్నారు. రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించినట్లు పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడు భార్గవ్ కు ప్రీతిని వేదించాలని సైఫ్ చెప్పాడు. RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ చెప్పినట్లు పోలీసులు తెలిపాడు. గత నెల 21 న హెచ్ఓడి నాగార్జునకు సైఫ్ ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళి, శ్రికల, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్ కు వైద్యులు కౌన్సిలింగ్ ఇవ్వగా.. మరుసటి మరుసటి రోజే ఆత్మహత్య కు పాల్పడిందని పోలీసులు గుర్తించారు.

సీపీఆర్ శిక్షణ ప్రారంభించిన కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని మేడ్చల్ లోని జీవీకే, ఈఎంఆర్ఐ వేదికగా ప్రారంభించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ఆలోచన కేటీఆర్ ది అని అన్నారు. వారి మామ చనిపోయినపుడు అక్కడికి వెళ్తే సీపీఆర్ తెలిసిన వారు లేక ప్రాణాలు కొలోయారు అని చెప్పారన్నారు. అప్పుడు జరిగిన చర్చలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని అనుకున్నామన్నారు.

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలను భారీగా పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. 3 నుంచి 7వ తరగతి వారికి రూ.1200, 8 నుంచి 10వ తరగతి చదివే వారికి రూ.1400, ఇంటర్ విద్యార్థులకు 1,875 రూపాయల డైట్ చార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. దాదాపు 25 శాతానికిపైగా డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు. సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీల పై బుధవారం ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఇప్పటివరకు ఇస్తున్న డైట్ ఛార్జీలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, అధికారుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు.

ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు వద్ద ఓఆర్ఆర్ రోడ్డుపై నుంచి సర్వీస్ రోడ్ పక్కన ఉన్న గుడిసెపై లారీ పడిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు హర్యానా నుంచి చిత్తూరుకు బియ్యం లోడ్‌తో లారీ వెళుతోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో అదుపు తప్పి కింద ఉన్న గుడిసెపై పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) దుర్మరణం పాలయ్యారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here