Homelatestదేశాలు దాటిన గ్రూప్-1 పేపర్.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ప్రజాస్వామ్యానికి చీకటిరోజన్న కేసీఆర్.. నేటి...

దేశాలు దాటిన గ్రూప్-1 పేపర్.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ప్రజాస్వామ్యానికి చీకటిరోజన్న కేసీఆర్.. నేటి బీజేపీ మహాధర్నాకు హైకోర్టు పర్మిషన్.. నేటి నుంచి 3 రోజులు వానలు.. మహిళ బిల్లుపై కవిత కొత్త ఉద్యమం.. నేటి టాప్ న్యూస్ ఇవే..

దేశం దాటిన గ్రూప్-1 పేపర్

గ్రూప్​–1 పేపర్​ దేశం దాటినట్లు సిట్ ​గుర్తించింది. పేపర్‌‌ లీకేజీలో ప్రధాన నిందితుడైన రాజశేఖర్‌‌‌‌రెడ్డి.. న్యూజిలాండ్​లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌‌రెడ్డికి వాట్సాప్‌‌లో పేపర్ ను పంపించినట్లు విచారణలో తేలింది. దీంతో అతడికి అధికారులు వాట్సాప్, మెయిల్ ద్వారా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే.. సిట్ నోటీసులకు ప్రశాంత్‌‌ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. దీంతో లుకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు ఇష్యూ చేసేందుకు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంకా.. పేపర్ లీకేజీ నిందితులను మరోసారి కస్టడీకి తీసుకోవడానికి శుక్రవారం నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధాక్యా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్, సురేశ్​ను ఆరురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.

ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్

కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎంపీ పదవి కోల్పోయారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన ఎంపీగా అనర్హుడయ్యాడు. ఇవాళ లోక్ సభ..రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించింది. ఈ మేరకు అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈకేసులో రాహుల్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండటంతో తాజాగా సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా తేల్చింది. రాహుల్ కి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

నరేంద్రమోదీ దురంహంకారానికి పరాకాష్ట: కేసీఆర్

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటిరోజు అని అభివర్ణించారు. రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

రాష్ట్రంలోని 50 లక్షల విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిస్తే వారిని అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తోందని చెప్పారు. నిర్భందాలు ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని, ఆ నిరసనకు వెళ్దామనుకునే లోపే తనను హౌజ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తన చుట్టుపక్కల రాకపోకలను నియంత్రించారని చెప్పారు. ఈ అక్రమ నిర్భందం దుర్మార్గమని, అటవిక చర్య అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.

మరో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం చాలా చోట్ల, సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరో ఉద్యమానికి కవిత సిద్ధం

దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో మహిళా బిల్లుపై ఉద్యమం ఉధృతం చేసేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమయ్యారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు రాయనున్నారు. “మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు” అని పేర్కొన్న పోస్టర్ ను కవిత విడుదల చేశారు.

బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ‘మా నౌకర్లుమాగ్గావాలె’ నినాదంతో శనివారం బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ధర్నాలో 500 మందికి మించరాదని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది. ధర్నాలో పాల్గొనే బీజేపీ ముఖ్య నేతల వివరాలను శుక్రవారం రాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని సూచించింది. ధర్నాకు అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. టీఎస్‌‌‌‌ పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25న ధర్నా చౌక్‌‌‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc