ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేత.. తెలంగాణలో వేసవి సెలవుల ప్రకటన.. హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్.. ఆ నియామకాల మెరిట్ జాబితా విడుదల.. నేటి టాప్ న్యూస్ ఇవే..

ప్రజలకు కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ నవమి నాడు ప్రతి సంవత్సరమూ ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వాడ వాడనా వైభవోపేతంగా దేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రంతోపాటు, యావత్ భారతదేశం సుభిక్షింగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సిఎం కేసీఆర్ ప్రార్థించారు.

బీఆర్ఎస్ లో కొనసాగుతోన్న చేరికలు

ఇతర రాష్ట్రాలకు నుంచి బిఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం నాడు మరో కీలక నేత బీఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టు ఉన్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత ‘అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్’ బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువాను స్వీకరించి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితాను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిండి. అభ్యంతరాలు స్వీకరించేందుకు వచ్చే నెల ఒకటి వరకు (4 రోజులు) గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. మెరిట్ జాబితా, ఇతర వివరాల కోసం mhsrb.telangana.gov.in సందర్శించాలని సూచించారు.

ఏఈఈ పరీక్ష తేదీలు విడుదల

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. మే 8న ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, మే 21న సివిల్‌ ఇంజినీరింగ్‌ ఓఎంఆర్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్‌ లీకేజీ కారణంగా కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్‌కు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు హెల్ప్‌లైన్లను ఆశ్రయించి, వారి సూచనల మేరకు పరీక్షలు రాశారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బుధవారం కామర్స్‌, కెమిస్ట్రీ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. బుధవారం చివరిరోజు మంచిర్యాలలో ఇద్దరు, వికారాబాద్‌, మేడ్చల్‌ – మల్కాజిగిరిల్లో ఒకరు చొప్పున విద్యార్థులు డిబార్‌ అయ్యారు.

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

మార్చి 30 గురువారం శ్రీరామ నవమి సందర్భంగా జరగనున్న శ్రీరామ నవమి శోభ యాత్రకు ముందు హైదరాబాద్ పోలీసులు పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రధాన ఊరేగింపు సీతారాం బాగ్ ఆలయం నుండి రామ్‌కోట్‌లోని హనుమాన్ వ్యాయంశాల స్కూల్ వరకు, భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పిఎస్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్ పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమెరత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, బేగంబజార్, బర్తన్ బజార్, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ మీదుగా ప్రయాణిస్తుండగా, చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ఊరేగింపు ఈ ప్రాంతాల గుండా వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లించబడుతుంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తాము కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

25 నుంచి వేసవి సెలవులు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 202324 విద్యా సంవత్సరం జూన్12 న ప్రాసికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్రంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు SA – II ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్నారు.

ప్రమాద ఘటనను సుమోటో గా తీసుకున్న హైకోర్టు

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ ప్రమాదాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన హైకోర్టు … ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కొరింది. స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో మార్చి16న రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here