అశ్రునయనాలతో కృష్ణ ఆఖరి యాత్ర.. ఈడీ దూకుడు.. చంద్రబాబుకిదే లాస్ట్.. టాప్ టెన్ న్యూస్ ఇవే

ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

గుండె పోటుకు గురై చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన సూపర్ స్టార్ అంత్యక్రియలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన సినీ ప్రముఖులు, అభిమానుల అశృనయనాల నడుమ ఆయన అంతిమయాత్ర కొనసాగింది. సాయంత్రం 3.30 గంటలకు జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

మంత్రి తలసాని సోదరులపై ఈడీ

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను ఈడీ ప్రశ్నించింది. క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లింపుకు సంబంధించి నమోదు చేసిన ప్రశ్నలపై ఈడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేశ్ యాదవ్, ధర్మేందర్ యాదవ్ ను ప్రశ్నించింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ కు నోటీసులు జారీ చేసింది.

బండి సంజయ్​ అయిదో విడత యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అయిదో విడత యాత్ర చేపట్టనున్నారు. ఈసారి ఆదిలాబాద్​ జిల్లా ముథోల్​ నియోజకవర్గంలోని బాసర నుండి యాత్రను ప్రారంభించనున్నట్లు బండి సంజయ్​ ప్రకటించారు. ఈనెలాఖరులోగా పాదయాత్ర మొదలు పెడుతామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ’మునుగోడు గెలుపోటములతో బీజేపీ కుంగిపోలేదు. మరింత ఉత్సాహంతో, పట్టుదలతో పాదయాత్ర-5 ప్రారంభించబోతున్నాం. ప్రజలు తమ పక్షాన ఎవరు పోరాడుతున్నారో గమనిస్తున్నారు. ఎవరు అండగా ఉంటారో చూస్తున్నారు…’ అని సంజయ్​ మీడియాతో మాట్లాడారు.

ఇదే నా చివరి ఎన్నిక: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపించకపోతే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతోందని కర్నూలు జిల్లాలోల నిర్వహించిన ఓ సభలో అన్నారు. తనను, తన భార్యను అసెంబ్లీలో అవమానించారంలూ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ కు G20 అధ్యక్ష పదవి

భారతదేశం G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో బాలిలో జరుగుతున్న G20 సమ్మిట్‌లో G20 అధ్యక్ష పదవికి అధికారికంగా లాఠీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. డిసెంబర్ 1 నుంచి G 20 అధ్యక్ష పదవిని చేపట్టేందుకు భారత్ సర్వం సిద్ధం చేసుకుంది.

తెలంగాణలో మరో 15 ఫైర్ స్టేషన్లు..

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను కూడా మంజూరు చేసింది.
వీటిలో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 లను అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ కి అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా – ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్, హైదరాబాద్ జిల్లా – అంబర్ పెట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్, జనగామ – స్టేషన్ ఘనపూర్, మహబూబాబాద్ – డోర్నకల్, మెదక్ – నర్సాపూర్, సిద్దిపేట – హుస్నాబాద్, నాగర్ కర్నూల్ – కల్వకుర్తి, నిజామాబాద్ – బాల్కొండ,
జగిత్యాల – ధర్మపురి, భద్రాద్రి కొత్తగూడెం – పినపాక లో కొత్త ఫైర్ స్టేషన్ లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

తెరుచుకున్న శబరిమల ఆలయం

మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం తెరుచుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో సాయంత్రం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు. కరోనా ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం విశేషం. భక్తులు ఆన్​లైన్​ లేదా స్పాట్ బుకింగ్ పద్ధతిలో దర్శనానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అమెరికాకు పూర్వ వైభవం తెస్తా: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించారు. అమెరికాకు పూర్వ వైభవం తెచ్చేందుకు, మరింత గొప్పగా నిలిపేందుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో జో బైడెన్ మళ్లీ ఎన్నికవ్వకుండా చూసుకుంటానన్నారు.

50 ఏండ్ల తర్వాత మూన్​పైకి అమెరికా రాకెట్

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏండ్లకు మళ్లీ చంద్రునిపైకి రాకెట్​ను పంపింది. మెగా మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1.. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మూడు టెస్ట్ డమ్మీలను మోసుకెళ్లింది. చంద్రునిపైకి మళ్లీ ఆస్ట్రోనాట్​లను పంపడానికిగానూ అమెరికా ఈ ప్రయోగం చేపట్టింది.వ

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here