అంబరాన్నంటిన న్యూఇయర్ సంబరాలు.. నిరుద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. నా గురువు బీజేపీ: రాహుల్ గాంధీ.. హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే!

దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు:


దేశవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి ఫుల్లు దావత్‌లతో కొత్త సంవత్సరానికి జనాలు ఆహ్వానం పలికారు. లిక్కర్ షాపులు, నాన్ వెజ్ షాపుల ముంగట జనాలు బారులు తీరారు. ఒక్కరోజే వేల కోట్ల మందు, మాంసం అమ్ముడుపోయింది.

ఒకే రోజు 4 నోటిఫికేషన్లు:


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో 4 నోటిఫికేషన్లను విడుదల చేసి 2022ను ముగించింది. వివిధ విభాగాల్లోని 802 పోస్టులకు శనివారం నోటిఫికేషన్లను ఇచ్చింది. కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (డిగ్రీ లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఈ నెల 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. అప్లికేషన్లకు చివరి తేదీని ఫిబ్రవరి 20గా నిర్ణయించింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 21నుంచి అప్లికేషన్లను తీసుకోనుంది. ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తులను స్వీకరించనుండగా.. మే లేదా జూన్లో ఎగ్జామ్ను నిర్వహించే అవకాశమున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 78 పోస్టులకు గానూ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను తీసుకోనుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లను తీసుకోనుంది. అప్లికేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 1 కాగా.. ఎగ్జామ్ ను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది.

నా గురువు బీజేపీ: రాహుల్ గాంధీ


బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు చేశారు. ‘ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు’ అనే విషయాన్ని బీజేపీని చూసి నేర్చుకున్నట్లు చెప్పారు. తన భవిష్యత్ కు ఒక రోడ్ మ్యాప్ ను కూడా బీజేపీయే చూపిస్తోందని రాహుల్ సటైర్ వేశారు. ‘‘బీజేపీ వాళ్లు కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నా. దాని వల్ల కాంగ్రెస్ పార్టీ తమ సైద్ధాంతికతను, భావజాలాన్ని గ్రహించేందుకు ఆస్కారం కలుగుతుంది’’ అని రాహుల్ అన్నారు.

కశ్మీర్ ఎన్‌కౌంటర్లలో 172 మరణాలు:


2022లో కశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లలో 172 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో 41 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాదిలో కశ్మీర్‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు చెప్పారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)/లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన 108 మంది ఉగ్రవాదులు , జైషే మహ్మద్ (జేఎం)కు చెందిన 35 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు.

బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్:


అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని పరిగి సబ్ జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో పోలీస్ వాహనాలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు జైలు వద్దకు భారీగా తరలిరావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నేడు కొత్తగూడ్ ఫ్లైఓవర్‌ ప్రారంభం:


కొత్తగూడ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ 263 కోట్ల రూపాయలతో 3 కిలో మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. ఫ్లైఓవర్కు అనుబంధంగా కొత్తగూడ జంక్షన్లో 470 మీటర్ల పొడవుతో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ను సైతం ఏర్పాటు చేశారు. కొత్త‌గూడ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో కొండాపూర్, గ‌చ్చిబౌలి వాసుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి.

రాహులే ప్రధాని అభ్యర్థి.. కానీ..:


2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతిచ్చే విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం లేదంటూనే మెలిక పెట్టారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసే పార్టీల నేతలంతా కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. పాట్నాలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ సమాధానం చెప్పారు. అయితే రాహుల్‌కు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని నితీశ్ విస్పష్టంగా చెప్పలేకపోయారు. భారత్ జోడో అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదని తేల్చి చెప్పారు.

ఉరికించి కొడతాం: బండి సంజయ్


హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఉరికించి కొడుతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందువులపై పీడీ యాక్ట్‌లు పెడుతారని, హిందూ దేవుళ్ళను కించపరిచిన వాళ్ళపై మాత్రం చర్యలు ఉండవని అన్నారు.

బాధ్యతలు చేపట్టిన కొత్త డీజీపీ:


తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. నక్సల్స్ ఏరియాలో పనితీరుకుగాను.. అంజనీకుమార్ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.

ఢిల్లీలో 24 గంటలు హోటల్స్:


నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని స్టార్ హోటళ్లు, వాటిలోని బార్ అండ్ రెస్టారెంట్లకు తీపి కబురు వినిపించింది. వాటి వ్యాపారాలకు దన్నుగా నిలిచేలా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఏర్పాటుచేసిన సాధికార కమిటీ కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ పరిధిలోని ఫోర్ స్టార్ హోటళ్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను ఇకపై 24 గంటల పాటు తెరిచి ఉంచేలా సడలింపు కల్పించింది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ పరిధుల్లోని స్టార్ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు కూడా ఈ సడలింపును సద్వినియోగం చేసుకోవచ్చని కమిటీ స్పష్టం చేసింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here