UDAYUM SPECIAL STORY : సిట్టింగ్లకు టికెట్లిస్తే.. అయిదుగురు మినిస్టర్లకు గండం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ పోటీకి దింపాలని టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో.. ఎన్నికలకు సైరన్ ఊదినట్లయింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో మొత్తం 102 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో సునాయాసంగా గెలిచే సిట్టింగ్లు ఎవరు.. ఎంతమందికి ఓట్ల గండం పొంచి ఉంది… ఉదయం.కామ్ అందిస్తున్న పొలిటికల్ బిగ్ స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నెల 18 నుంచి తెలంగాణలో కంటివెలుగు
తెలంగాణలో ఈ నెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దాదాపు 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించడమే లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం వైద్యం అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొత్త సెక్రెటేరియట్ పనులను పరిశీలించిన కేసీఆర్

తుది దశకు చేరుకున్న కొత్త సెక్రెటేరియట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సిఎం అనువైన చోట నిర్మాణం చేపట్టాలన్నారు. మంత్రులు అధికారులు కలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాలు, డైనింగ్ హాల్స్ ను సీఎం పరిశీలించారు. జాతీయ అంతర్జాతీయ అతిథులకోసం నిర్మించిన సమావేశ మందిరాలను సిఎం పరిశీలించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ నేత తుషార్, కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ నోటిసీులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు రావాలని తెలిపింది.
అమిత్ షాతో ఈటల భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరు చర్చించారు. ఈటల రాజేందర్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజీవ్ హంతకులపై కేంద్రం పిటిషన్:
రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఈ నెల 11న జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండానే తీర్పు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని పిటిషన్ లో పేర్కొంది.
హైదరాబాద్ లో కృష్ణ స్మారక చిహ్నం:

ఇటీవల మరణించిన ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ స్మారక చిహ్నాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మెమోరియల్ లో ఆయన స్మారక చిహ్నంతో పాటు ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన ఫొటోలు, అవార్డులను ప్రదర్శనకు ఉంచనున్నట్లు సమాచారం.
ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందిన ఈ రాకెట్ ను శ్రీహరికోటలోని షార్ నుంచి శుక్రవారం ప్రయోగించనున్నారు.
దళిత బంధుపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జీరీ చేసింది. పథకం కింద లబ్ధిపొందడానికి స్థానిక ఎమ్మెల్యే ఆమోంద, సిఫార్సు అవసరం లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఆమోదం లేదని వరంగల్ జిల్లా కలెక్టర్ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన మెమోను కొట్టివేసింది. పిటిషనర్ లకు సంబంధించిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీకి పంపించాలని సూచించింది.
సౌదీకి వెళ్తున్న వారికి శుభవార్త

ఉపాధి కోసం సౌదీ వెళ్తున్న వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇండియా నుంచి సౌదీ వెళ్లే వారికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని సౌదీ అరేబియా సర్కార్ స్పష్టం చేసింది.
తెలంగాణ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అడోల్సెంట్ కిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు విద్యార్థినులకు ఉచితంగా ఫ్రీగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రెండో ఏరోస్పేస్ పార్కులు
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏయిరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు. ఇందులో ఒకటి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎలిమినేడులో కాగా.. మరొక దాని కోసం స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు.