రేసింగ్​ టికెట్ల మనీ వాపస్​.. మంత్రి ఇంట్లో రూ.10.50 కోట్లు సీజ్​.. ఢిల్లీలో మరో దారుణం.. టాప్ టెన్ న్యూస్

1. ఇండియన్​ రేసింగ్​ లీగ్​ టికెట్లు కొన్నవాళ్లకు మనీ వాపస్​

హైదరాబాద్​లో ఇటీవల జరిగిన ఇండియన్​ రేసింగ్​​ లీగ్​ (IRL) నిర్వాహకులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రేస్​ చూసేందుకు టికెట్స్​ బుక్​ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. టికెట్స్ బుక్ చేసుకున్న వారందరికీ మనీ రిఫండ్ చేస్తామని ప్రకటన జారీ చేసింది. ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్​లో ఐమాక్స్​ చుట్టూ ఈ ఫార్మూలా రేస్​ నిర్వహించారు. వరుస ప్రమాదాలు, రేసర్లకు గాయాలు కావటంతో ఈ రేస్​ అర్ధాంతరంగా రద్దయింది. దీనికి సంబంధించి ఆన్​ లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారందరికీ ఈమెయిల్ , మెసేజ్ ద్వారా మనీ వాపస్​ వివరాలు అందించనున్నారు.

2. రూ.10.50 కోట్లు.. 12 లాకర్లు సీజ్​.. మంత్రి ఇంటిపై కొనసాగుతున్న సోదాలు​

మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అకౌంట్లలో లేని కారణంగా దాదాపు రూ.10.50 కోట్లు సీజ్​ చేసినట్లు సమాచారం. 8 బ్యాంకుల్లో 12 లాకర్లు.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌‌రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లను సీజ్ చేశారు. పన్నుఎగవేత, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ గుర్తించింది. సోదాలు జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి కొడుకు మహేందర్‌‌రెడ్డి, బంధువు ప్రవీణ్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని సూరారంలోని మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్‌కి తరలించారు. తన కొడుకును ఐటీ అధికారులు వేధించారని.. కొట్టారని.. అందుకే అస్వస్థతకు గురయ్యాడని మల్లారెడ్డి ఆరోపించారు. అతని ఆరోగ్యం స్థిమితంగా ఉందని, గతంలో కూడా ఇలాంటి నొప్పి వచ్చిందని మంత్రి కోడలు డాక్టర్​ ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. సోదాలు జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి ఇంటి వద్ద, హాస్పిటల్‌ వద్ద టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీజ్‌ చేసిన డబ్బు వివరాలను ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.

3. ఫామ్​హౌజ్​ కేసు .. రామచంద్రభారతి పై మరో ఫిర్యాదు

ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్​ కేసులో అరెస్టయిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ పై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన ల్యాప్​టాప్​ల మరో పాస్​పోర్ట్ దొరికిందని.. భరత్ కుమార్ శర్మ పేరుతో ఆ పాస్​ పోర్టు దొరికిందని సిట్​ పోలీసులు ఈ ఫిర్యాదు నమోదు చేశారు. వేర్వేరు పేర్లతో రెండు పాస్ పోర్టులు ఉండటం నేరమని సిట్​ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గంగాధర్ బంజార హిల్స్ స్టేషన్​లో ఈ పిర్యాదు చేశారు. ఇప్పటికే రామచంద్రభారతి వద్ద రెండు, మూడు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్లు ఉన్నాయని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది.

4. బీఎల్​ సంతోష్​కు మళ్లీ నోటీసులివ్వండి.. హైకోర్టు

ఎమ్మెల్యేల ఫామ్​హౌజ్​ కేసును హైకోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి బీ ఎల్​ సంతోష్​ సిట్​ విచారణకు హాజరుకాలేదు. ఆయనకు నోటీసులు అందలేదని, గుజరాత్ ఎన్నికల పర్యటనలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి సంతోష్ కు 41 ఏ సీఆర్పీసీ సెక్షన్​ కింద నోటీసులు ఇవ్వాలని సూచించింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు సూచించిన వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ.. తదుపరి విచారణ ను ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేసింది.

5. ఈసీ నియామకాలపై.. సుప్రీంకోర్టు

ఎన్నికల కమిషనర్ల నియామకం జరుగుతున్న తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇటీవల ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న అరుణ్ గోయల్ నియామక ప్రకియకు సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలని.. ప్రధానమంత్రిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునే పారదర్శకత ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంతకాలం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్​ అరుణ్ గోయల్ నవంబరు 18న వలంటరీ రిటైర్​మెంట్​ తీసుకున్నారు. 19న గోయల్ ను ఈసీగా నియమించారు.

6. డ్రగ్స్​కు బానిసై.. ఇంట్లో అందరినీ చంపేశాడు…

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. డ్రగ్స్​కు బానిసైన 25 ఏళ్ల యువకుడు సొంత కుటుంబ సభ్యులందరినీ కత్తితో పొడిచి చంపేశాడు. ఢిల్లీలోని పాలంలో ఈ ఘోరం జరిగింది. కేశవ్​ డ్రగ్స్ కు కొంతకాలంగా ఎడిక్ట్ అయ్యాడు. ఈ అలవాటు మార్పించేందుకు అతని కుటుంబ సభ్యులు ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ లో చేర్పించారు. ట్రీట్​మెంట్ తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న కేశవ్​.. మళ్లీ డ్రగ్స్​ కావాలంటూ.. డబ్బులు ఇవ్వాలని ఇంట్లో ఉన్న అందరితో గొడవకు దిగాడు. విచక్షణ కోల్పోయి తల్లి దర్శన, తండ్రి దినేష్, సోదరి ఊర్వశి, నాయనమ్మ దేవానా దేవిని కత్తితో పొడిచి చంపేశాడు.

7. ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్ అంత్యక్రియలు.. అది​ ప్రభుత్వ హత్యేనన్న తుడుం దెబ్బ.. రేవంత్​రెడ్డి

ఫారెస్ట్ రేంజర్​ శ్రీనివాసరావు హత్య ఘటనపై.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో అదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నిరసన తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు-అటవీ శాఖ అధికారుల మద్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని.. ఎఫ్​ఆర్​వో శ్రీనివాసరావును ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించింది. పొడుభూములకు పట్టాలిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి సిఎం కేసీఆర్ మాట తప్పారని.. ప్రభుత్వమే ఆడివాసులపై అటవీ శాఖ అధికారులను ఉసిగొల్పుతుందని ఆరోపించింది. ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణి వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపించింది. ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​ శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేననీ, దానికి సీఎం కేసీఆర్​ బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు రేవంత్​రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఖమ్మం.. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి లో అధికారిక లాంఛనాలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. నల్ల బ్యాడ్జీలతో ఫారెస్ట్ సిబ్బంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రులు అజయ్, ఇంద్రకరన్ రెడ్డి పాడె మోశారు.

8. డిసెంబర్ 1 తర్వాత పోడు రైతులకు పట్టాలు..

రాష్ట్రంలోని అర్హులైన పోడు రైతులందరికీ డిసెంబర్ 1వ తేదీ తర్వాత పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోందని గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్​​ వెల్లడించారు. పోడు భూముల రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. చంద్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును కొందరు గుత్తికోయలు హత్య చేయడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు.

9. అమెరికాలో వాల్​ మార్ట్ స్టోర్​లో కాల్పులు.. 10 మంది మృతి

అమెరికాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వర్జీనియా స్టేట్​లోని చీసేపీక్‌లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో స్టోర్ మేనేజ‌ర్‌ త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పులు జ‌రిపిన‌ట్లు సమాచారం. అనంతరం త‌న‌ను తాను కాల్చుకుని మృతి చెందాడు. కాల్పుల్లో సుమారు 10 మంది అక్కడికక్కడే చనిపోయి ఉంటార‌ని, పలువురికి గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. కార‌ణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

10. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్ షాప్.. ఇలా అప్లై చేసుకోండి..

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు మేనిజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. డిసెంబర్ 4వ తేదీన జీఈఎస్టీ-2023 పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్ చదువుతున్న విద్యార్థినులు ఈ పరీక్ష రాయడానికి అర్హులన్నారు. ఈ పరీక్ష రాయడానికి నెలకు రూ.5 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు www.ntrtrust.orgలో ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here