Homelatestనేడే కవిత ఇంటికి సీబీఐ.. కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్.. గుజరాత్ సీఎంగా ఎవరంటే?.. నేటి టాప్...

నేడే కవిత ఇంటికి సీబీఐ.. కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్.. గుజరాత్ సీఎంగా ఎవరంటే?.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను నేడు సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కవిత స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయనున్నారు. ఉదయం 11 గంటల తరువాత సీబీఐ అధికారుల స్పెషల్‌ టీమ్‌ కవిత ఇంటికి చేరుకోనుంది. అయితే.. ఈ నేపథ్యంలో కవిత మద్దతుదారులు ఆమె ఇంటి ఎదుట భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు.

2. కోమటిరెడ్డికి హైకమాండ్ షాక్:

తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మణిక్కం ఠాగూర్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని నియమించింది హైకమాండ్. ఈ రెండు కమిటీల్లోనూ పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి చోటు దక్కలేదు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలొ సభ్యులుగా 17 మందికి చోటు కల్పించారు. నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో 40 మందికి చోటు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరు కారణంగానే ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం.

3. మళ్లీ ఆయనకే గుజరాత్ పగ్గాలు:

గుజరాత్‌ సీఎంగా మళ్లీ భూపేంద్ర పటేల్‌నే నియమించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. శనివారం అహ్మదాబాద్‌లోని పార్టీ స్టేట్‌ ఆఫీసులో నిర్వహించిన లెజిస్లేటివ్ మీటింగ్‌లో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. ఈ మీటింగ్‌కు పరిశీలికులుగా పార్టీ సీనియర్‌‌ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. కొత్త గవర్నమెంట్‌ ఏర్పాటు చేసేందుకు శుక్రవారం భూపేంద్ర పటేల్‌తో పాటు ఆయన కేబినెట్‌ మొత్తం రాజీనామా చేసింది. కాగా, డిసెంబర్‌‌ 12న సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

4. కిడ్నాప్ కేసులో కీలక నిజాలు:

డెంటల్ స్టూడెంట్‌ కిడ్నాప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడికి పాల్పడ్డవారిలో మొత్తం 32 మందిని శనివారం అరెస్ట్ చేశారు. జడ్జి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలులో రిమాండ్‌కి తరలించారు. పోలీసులు బాధితురాలు వైశాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు. లాక్‌డౌన్‌ తరువాత బ్యాట్‌మెంటెన్‌లో నవీన్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆమె తెలిపింది.తన వివరాలు తెలుసుకుని ఫ్రెండ్‌ షిప్ పేరుతో ఫ్యామిలీకి దగ్గరయ్యాడని చెప్పింది. ట్రిప్స్‌కి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వెళ్లామని వెల్లడించింది. ఈక్రమంలోనే తనంటే ఇష్టమని పెళ్ళి చేసుకోవాలని అడిగినట్లు చెప్పింది.ఇదే విషయం పేరెంట్స్‌ను అడగమని చెప్పానని వైశాలి తెలిపింది. పేరెంట్స్ ఇష్టం లేదని చెప్పినా నవీన్ వినిపించుకోలేదని చెప్పింది. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేక్ ఇన్‌స్ట్రగ్రామ్‌ క్రియేట్ చేశాడని వివరించింది.పెళ్ళి జరిగిందని తప్పుడు ప్రచారం చేశాడని తెలిపింది.పెళ్ళి జరిగిందని చెప్తున్న రోజున ఆర్మీ కాలేజ్‌లో డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు చెప్పింది.

5. హిమా‌చల్‌ప్రదేశ్‌ సీఎంగా సుఖ్విందర్ సింగ్!

హిమాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల హైడ్రామాకు తెరపడింది. సీఎం ఎవరనే ఉత్కంఠ ముగిసింది. హెచ్‌పీసీసీ మాజీ ప్రెసిడెంట్, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును సీఎంగా కాంగ్రెస్ ఖరారు చేసింది. రాష్ట్ర ఏడో ముఖ్యమంత్రిగా ఆదివారం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

6. సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, ఇది కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్.. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

7. దీక్ష కొనసాగిస్తోన్న షర్మిల:

సీఎం కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నాడని వైఎస్ షర్మిల అన్నారు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి పర్మిషన్ ఇవ్వటం లేదని ఆమె మండిపడ్డారు. కోర్టులు అంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. తన ఇంటి వద్ద శనివారం కూడా ఆమె దీక్ష కొనసాగించారు.

8. శబరిమలకు ఆర్టీసీ బస్సులు:

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం డిస్కౌంట్ లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చైర్మన్ శనివారం పత్రిక ప్రకటనలో కోరారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్,ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, 02 వంట మనుషులు, 12 సంవత్సరాలు లోపు మణికంఠ స్వాములు, ఒక అటెండర్ను ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితం అని ఆయన ప్రకటించారు.

9. పెట్రోల్​ రేట్లలో తెలుగు రాష్ట్రాలే టాప్:

పెట్రోల్, డీజిల్ రేట్లలో తెలుగు రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయి. దేశంలో పెట్రో రేట్లు అత్యధికంగా ఏపీలో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది. కేంద్ర ప్రభుత్వం తన వ్యాట్ ను తగ్గించినప్పటికీ రెండు రాష్ట్రాలు వాటి వ్యాట్ ను యధావిధిగా కొనసాగిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఎక్కువ రేట్లు ఉన్న రాష్ట్రాల్లో పైకి చేరాయి. లీటరు పెట్రోల్ ధర ఏపిలో రూ.111.87, డిజీల్ రూ.99.61 ఉండగా, తెలంగాణలో పెట్రోల్ రూ.109.66, డిజీల్ రూ.97.82గా ఉంది.

10. తుఫాన్​తో చెన్నై అతలాకుతలం:

మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెన్నై అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. సిటీలో చాలాచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. మాండౌస్ తుఫాన్ శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంటలకు మహాబలిపురం వద్ద తీరం దాటింది. ఆ టైమ్ లో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. వీటి ధాటికి చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఆగమాగమయ్యాయి. సిటీలో దాదాపు 400 చెట్లు నేలకూలాయి. చెట్లు పడి, గోడలు కూలి కార్లు ధ్వంసమయ్యాయి.

11. కేబినేట్​ భేటీలో కీలక నిర్ణయాలు

12. ఇషాన్​ కిషన్​ డబుల్​ సెంచరీ రికార్డు

యువ ఓపెనర్​ ఇషాన్​ కిషన్​ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్​ సెంచరీ నమోదు చేశారు. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 రన్స్​ సాధించాడు. కెరీర్‌లో ఇషాన్​కు ఇదే తొలి సెంచరీ కూడా. తొలి సెంచరీ నే డబుల్​ సెంచరీగా మలుచుకున్న ఇషాన్​ వన్డే క్రికెట్​లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్​మేగా చరిత్రకెక్కాడు. ఇషాన్ 126 బంతుల్లో‌నే డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్​గా రికార్డు నెలకొల్పాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc