లిక్కర్​ స్కామ్​లో కవిత.. టుడే టాప్​ న్యూస్​

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియాతో పాటు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇందులో ప్రమేయుముందని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) ధ్రువీకరించింది. సీబీఐ స్పెషల్​ కోర్టుకు సమర్పించిన రిమాండ్​ రిపోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించింది. లిక్కర్​ పాలసీకి సంబంధించి ఆప్​ నేతలకు సౌత్​ గ్రూప్​ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, సౌత్గ్రూప్‌ను శరత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మేనేజ్​ చేశారని ఈడీ పేర్కొంది. అసలేం జరిగింది.. లిక్కర్​ స్కామ్​ పూర్తి వివరాల లింక్​

కరెంట్ ఛార్జీలు ఇవే.. సర్​ఛార్జీనే భారం

ఎన్నికల ఏడాది కావటంతో కరెంట్​ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఏడాది అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఏడాది కొనసాగిస్తామని డిస్కంలు తమ వార్షిక నివేదికలను ఈఆర్​సీకి సమర్పించాయి. కానీ.. ఇంధన సర్ధుబాటు ఛార్జీల పేరుతో వచ్చే 2023 ఏప్రిల్‌1 నుంచి ప్రతి నెలా విద్యుత్‌ వినియోగదారునికి యూనిట్‌కు 30 పైసల చొప్పున పెంచుకునేందుకు ఈఆర్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వినియోగదారులపై సర్​ ఛార్జీల రూపంలో కొంత వడ్డింపు తప్పదు. నిరుడు గృహ వినియోగదారులపై యూనిట్ కు 50పైసలు, కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌ వినియోగదారులపై రూ.1 చొప్పున పెంచిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్​ సంతోష్​

ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్​ సంతోష్​ ప్రమేయమున్నట్లు సిట్​ మరిన్ని ఆధారాలను బయటపెట్టింది. నిందితులు ఆయనతో వాట్సప్​లో చాట్​ చేసిన స్క్రీన్​ షాట్లను హైకోర్టుకు సమర్పించింది. అక్టోబర్​లో ఢిల్లీలో సంతోష్​ నివాసంలో చర్చలు జరిగాయని, ఈ కేసులో ప్రమేయమున్న మొబైల్​ లొకేషన్ల ద్వారా ఈ విషయం బయటపడిందని సిట్​ దర్యాప్తులో వెల్లడైంది.

ఈడీ విచారణకు దేవరకొండ!

లైగర్‌‌ సినిమా పెట్టుబడుల్లో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు హీరో విజయ్‌ దేవరకొండ వరకూ వచ్చింది. బషీర్‌‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో బుధవారం విజయ్‌ దేవరకొండను సుమారు 9 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఇదే కేసులో డైరెక్టర్ పూరీజగన్నాథ్, నటి ఛార్మీలను ఈనెల 17న విచారించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా విజయ్‌దేవరకొండ, ఆయన ఆడిటర్లు, మేనేజర్లను ఈడీ ప్రశ్నించింది. లైగర్ సినిమా రెమ్యూనరేషన్, విదేశాల్లో ఖర్చు, హాలీవుడ్ నటులకు జరిగిన చెల్లింపుల వివరాలను ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమాలో కొందరు లీడర్లు బ్లాక్​ మనీ పెట్టినట్లు ఆరోపణలపైనే ఈడీ ఎంక్వైరీ చేస్తోంది.

మంత్రి గంగుల.. ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

మంత్రి గంగుల కమలాకర్‌‌, టీఆర్‌‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్‌ కేసులో గురువారం జరిగే ఎంక్వైరీకి హాజరు కావాలని ఈ ఇద్దరికీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. శ్రీనివాస్‌కు గంగుల, రవిచంద్రతో సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సీబీఐలో తనకు ఉన్న పలుకుబడితో గ్రానైట్ కేసుల నుంచి కాపాడుతానని చెప్పి గంగుల, రవిచంద్రకు శ్రీనివాస్ దగ్గరైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కవిత తానా.. షర్మిల తందానా!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నడుమ బుధవారం ట్విట్టర్ వార్ జరిగింది. షర్మిలను అరెస్ట్‌ చేసిన విధానాన్ని ఖండిస్తూ బీజేపీ నేతలు స్పందించడంపై తొలుత కవిత ట్వీట్ చేశారు. “తాము వదిలిన ‘ బాణం ’ తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు ” అని కవిత ట్వీట్ లో ఎద్దేవా చేశారు. “ పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు..పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘ కవిత’లకు కొదవ లేదు. ” అని షర్మిల రీట్వీట్ చేశారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఉద్యమకారుల పార్టీ అని, ఇప్పుడు ‘గూండాలు, బందిపోట్ల పార్టీ’గా మారిందని.. ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ అని షర్మిల చేసిన ట్వీట్లపై టీఆర్‌‌ఎస్ లీడర్లు మండిపడ్డారు. తెలంగాణలో విషపు నాగులు తిరుగుతున్నాయని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఏపీకి వెళ్ళి ఓదార్పు యాత్రాలు చేసుకోవాలని, నకరాలు చేస్తే, కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని ఎంపీ మాలోతు కవిత షర్మిలను హెచ్చరించారు.

మళ్లీ సోనూసూద్.. దాతృత్వం

బాలీవుడ్ స్టార్ సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న హర్యానాకు చెందిన ప్రముఖ సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంద్రజిత్ బార్కే అనే వ్యక్తి మమన్ ఖాన్ ఆరోగ్యం బాగోలేదని, ఆర్థిక పరిస్థితి కూడా బాలేదని అతనికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్.. “ఖాన్ సాహిబ్ ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా.. ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ రీట్వీట్ చేశారు.

కడుపులో 187 కాయిన్స్

కర్ణాటక బాగల్ కోట్లోని ఓ హాస్పిటల్లో వింత ఘటన జరిగింది. ఓ పేషెంట్కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు అతని కడుపులో నుంచి 187 నాణేలను బయటకు తీశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ద్యామప్ప అనే వ్యక్తి కొంతకాలంగా కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని హాస్పిటల్లో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 2 గంటల పాటు కష్టపడి మొత్తం 187 నాణేలను బయటకు తీశారు. ప్రస్తుతం పేషెంట్‌ కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు.

సిరీస్‌ కోల్పోయిన టీమ్ ఇండియా

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1–0తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వన్డే న్యూజిలాండ్ విన్ అవగా, రెండో వన్డే వర్షం కారణంగా డ్రా అయింది. మూడో వన్‌డేలో తొలుత ఇండియా బ్యాటింగ్‌కు దిగి 219 రన్‌ చేసి ఆల్‌ అవుట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.

నేడే గుజరాత్ లో ఫస్ట్ ఫేజ్​ పోలింగ్‌

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ సీట్లకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది ఓటర్లు తొలి దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గుజరాత్‌లో గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాఢ్వీ పోటీ చేస్తున్న ఖంబాలియా సీటుకు సైతం నేడే పోలింగ్ జరగనుంది.

ఐటీ కారిడార్‌‌లో షటిల్ బస్సులు

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్‌ బస్‌లను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ షటీల్‌ సర్వీస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. షటిల్ బస్ టికెట్లను బుక్ చేసుకునేందుకు, బస్సులు ఎక్కడున్నాయో లైవ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకునేందుకు ఓ యాప్‌ను కూడా తీసుకొస్తామని ఆర్టీసీ ప్రకటించింది.

రియల్ జాంబీని కనిపెట్టిన సైంటిస్టులు:

గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మంచు కరుగుతోంది. దీంతో వేల ఏండ్లుగా మంచులో దాగి ఉన్న వివిధ రకాల సూక్ష్మజీవులు, వైరస్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో రష్యాలో గడ్డ కట్టుకుపోయిన ఓ సరస్సులో జాంబీ వైరస్ బయటపడింది. ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటింస్టులు ఈ జాంబి వైరస్ జాడను గుర్తించారు. సైబీరియన్ తోడేలు పేగుల్లో ఈ వైరస్ను గుర్తించినట్టు వెల్లడించారు. పాండోరా ఎడోమాగా పిలుస్తున్న ఈ వైరస్కు శరవేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వైరస్ దాదాపు 48,500 ఏండ్ల కిందటిదని అంచనా వేస్తున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

TODAY TELUGU PAPERS HEAD LINES 2022 NOV 30