సక్సెస్ఫుల్ కాంబినేషన్ ను విడగొట్టిన మెగా సినిమా

ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాంబినేషన్ లు కొన్ని ఉన్నాయి.. అందులో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను బలం ఎంత దన్నుగా నిలిచేది. స్వయంవరం లాంటి సక్సెస్ఫుల్ మూవీతో మొదలైన వీరి ప్రయాణం.. జై చిరంజీవ లాంటి ప్లాప్ సినిమాతో ముగిసింది.

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, మన్మథుడు సక్సెస్ఫుల్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న వీరితో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు చిరంజీవి. వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఓ సినిమా చేయాల్సి ఉంది . అయితే అప్పటికే నువ్వే నువ్వే, అతడు చిత్రాలతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ తో కథ, మాటాలు రాయించారు. ముందుగా ఈ సినిమా అనుకున్నప్పుడు కథ లేదు. వైజయంతి మూవీస్ దగ్గర ఉన్న చిన్న లైన్ ను కథగా మార్చి డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్.

చిరంజీవి పక్కన హీరోయిన్లుగా సమీరా రెడ్డి, భూమిక లను తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కోటిని అనుకున్నారు. ,చిరు, అశ్వినిదత్ ఛాయిస్ మేరకు మణి శర్మను తీసుకున్నారు. 2006లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో జయ్ భాస్కర్, త్రివిక్రమ్ మళ్ళీ కలిసి పని చేయనే లేదు. త్రివిక్రమ్ తో విడిపోయాక విజయ్ భాస్కర్ ప్రేమ కావాలి రూపంలో ఓ యావరేజ్ హిట్ అందుకున్నారు . ఇక వెంకటేష్ మసాలా దాకా మిగిలినవన్ని పరాజయం పాలయ్యాయి.

కానీ త్రివిక్రమ్ మాత్రం అల వైకుంఠపురములో దాకా ఇంకా అగ్ర దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here