బీఆర్ఎస్గా టీఆర్‌ఎస్
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిసింది. ఈ మేరకు సీఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1:20 నిమిషాల సుముహూర్తానికి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ ఉత్సవాలు జరుపనున్నారు. టీఆర్ఎస్ భవన్లో అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ కార్యవర్గసభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
గుజరాత్‌లో బీజేపీ గ్రాండ్ విక్టరీ
గుజరాత్‌లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా 53 శాతానికి పైగా ఓట్లతో 157కి పైగా సీట్లను కైవసం చేసుకుంది. 182 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 27 శాతం ఓట్లతో 15 సీట్లను, ఆప్ 13 శాతం ఓట్లతో 5 సీట్లను గెలుపొందాయి. 4 స్థానాలను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. నా సొంత రాష్ట్రం గుజరాత్ కు ధన్యవాదాలు. ఈ భారీ విజయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యాను’’ అని మోదీ ట్వీట్ చేశారు.
హిమచల్‌లో కాంగ్రెస్ విజయం
హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారం గల్లంతు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 28, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు.
నేడు మెట్రో ఎయిర్పోర్ట్ రూట్‌కు భూమిపూజ
ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈరోజు పునాది రాయి వేయనున్నారు. మొత్త 31 కిలోమీటర్లు ఈ రూట్ నిర్మించబోతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి అంచనా ఖర్చు రూ.6250 కోట్లు. రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు డీపీఆర్ కూడా పూర్తయింది. సిటీలో మెట్రో ప్రస్తుతం మినిమమ్ స్పీడ్ 35 కిలోమీటర్ ఫర్ అవర్.. మాక్సిమమ్ 80 కిలోమీటర్లు ఉంది. ఎయిర్ పోర్ట్ మెట్రో స్పీడ్ 120 మాక్సిమమ్ ఉంటుందని.. 26 నిమిషాల్లో 31 కిలోమీటర్లు చేరుకోవచ్చు. ఈ ట్రైన్ లిమిటెడ్ స్టేషన్లలో ఆగుతుంది.
ఎమ్మెల్యేగా గెలిచిన జడేజా భార్య
గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జడేజాతో కలిసి జామ్ నగర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు.
సజ్జల సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ కలిసి ఉమ్మడి ఏపీగా ఉండటమే వైసీపీ విధానమని అన్నారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోబోమన్నారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలి.. లేదా సరిదిద్దాలని కోర్టులో, ఇతర వేదికలపై కోరతామన్నారు. విషపు ఆలోచనలతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అర్ధం లేనివని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. “ నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు ”అని ఆమె ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదని, మీ ప్రాంత అభివృద్ధి మీద అని ట్వీట్ లో పేర్కొన్నారు.
డ్రగ్ కంట్రోల్‌లో ఉద్యోగాలు
టీఎస్పీఎస్సీ మరో జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)లో ఖాళీగా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. 18 పోస్టులను నింపనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
సోషల్ మీడియా పోస్టులపై కేసుల్లేవు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఇకపై అరెస్టులు చేయడం, శిక్షలు వేయడం కుదరదు. సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల మీద ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో ఇండియా వర్సెస్ న్యూజీలాండ్
ప్రస్తుతం బంగ్లాదేశ్ టూరులో ఉన్న టీమిండియా రాబోమే 4 నెలలు ఫుల్ బిజీగా ఉండనుంది. జనవరి మొదటి రెండు వారాలు శ్రీలంకతో, మూడో వారం నుంచి న్యూజీల్యాండ్ టీమ్‌తో వన్‌డే, టీట్వంటీ సిరీస్‌లు ఆడనుంది. జనవరి 18న న్యూజీలాండ్‌తో జరిగిన ఫస్ట్ వన్‌డే మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా టీమ్‌తో టెస్ట్, వన్‌డే సిరీస్ జరగనుంది. మార్చి 19న జరిగే రెండో వన్‌డే మ్యాచ్ వైజాగ్‌లో జరగనుంది.